Contents
చిట్టిఎలుక
అనగనగా ఒక ఊరిలో ఒక చిట్టి ఎలుక ఉండేది దానికి చాలా రోజుల నుండి సరైన ఆహారం లేక చాలా నీరసించిపోయి బక్కచిక్కి పోయి వుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ అలానడుచుకుంటూ వెళ్తుంటే దానికి దారిలో ఒక ప్రక్కన డబ్బాలో కొన్ని మొక్కజొన్న గింజలు కనబడ్డాయి హమ్మయ్య!! ఇప్పటికైనా ఆహారం దొరికింది అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి అటువైపు చూసింది కానీ ఆ డబ్బా లోపలికి వెళ్ళే రంధ్రం మాత్రం చాలా చిన్నగా వుంది .
ఇప్పుడు దీనిలోపలికి ఎలావెళ్ళాలో అనుకుంటూ మెల్లగా ప్రయత్నించింది , చాలా రోజుల నుంచి ఆహారం తినలేదు కనుక చాలా బలహీనంగా సన్నగా ఉండి డబ్బా రంధ్రంలోకి సులువుగా దూరిపోయింది.
తన ఆకలి,ఆశ తీరేవరకు మొక్కజొన్న గింజలు తింటూనే ఉంది, ఇంక తినలేను అనుకున్నప్పుడు తినడం ఆపివేసి ఇక డబ్బాలోంచి బయటికి వెళ్దామని నిర్ణయించుకుంది కానీ దాని శరీరం ప్రరిమాణం అందుకు సహకరించలేదు .
బయటికి ఎలా వెళ్లాలో అనే ఆలోచన లేకుండా అతిగా తినడం వలన అది డబ్బా కి ఉన్న రంధ్రం పరిమాణాన్ని మించి పెద్దగా అయిపోయింది అప్పుడు ఎలుక కి బయటికి ఎలా వెళ్లాలి అర్థం కాలేదు.
అలా…
లోపల కూర్చుని గట్టిగ బయట ఎవరైనా ఉన్నారా… కాపాడండి నన్ను… బయటకి తీయండి… అంటూ అరుస్తూ ఉంది . అటుగా వెళుతున్న ఒక ఉడుత డబ్బాలో వున్న ఎలుకని చూసి జరిగిన విషయం అంతా తెలుసుకొని ,ఓస్ !! అంతేనా నేను ఉపాయం చెప్తాను విను, మళ్లీ ఆహారం తినడం మానేసి నీ యధాస్థితికి అంటే బక్క పలుచగా తయారైతే నువ్వు సులభంగా బయటికి రాగలవు అని ఉచిత సలహా ఇచ్చింది.
ఆ మాట విన్న ఎలుకకు అది తప్ప వేరే దారి కూడా తెలియలేదు ,సరే అంటూ ఆ రోజు నుంచి కళ్ళముందు తిండి వున్నా తినకుండా తప్పని ఉపవాసాన్ని మళ్ళీ ప్రారంబించింది.
నీతి:అతి ఎప్పుడూ ప్రమాదకరమే
మనలో చాలామంది సంపాదన లేనప్పుడు సంపాదన కోసం అరువులు జాచి సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి శరీరానికి సుఖాన్ని అలవాటు చేసి రకరకాల అనారోగ్య సమస్యలు తెచ్చుకొని, డబ్బున్నా ఇష్టమైనవి తినలేని పేదవారిగా నిస్సహాయులుగా తయారవుతున్నాం .
తెలిసి తప్పులు చేయడం మానవ నైజం అనుకుంటా …
Riddles For Every one: Riddles 1
Kids Riddles For Every one: Riddles 2
small Riddles For Every one: Riddles 3
Riddles For Every one: Riddles 4
పొడుపుకథలు అందరికోసం : Riddles 5
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam
Inspirational women in India: Great Women
Success full people stories: Neeraj Chopra
For more moral stories please visit: Jeevitham
For more Telugu stories please click: Small moral stories for kids in Telugu
more kids stories please visit: YES and NO Story