"ప్రవర్తన" Small moral story for Students
Spread the love

Contents

ప్రవర్తన

“ప్రవర్తన” Small moral story for Students

 

అనగనగా ఒక కుటుంబం ఒక ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కొత్త ఊరికి వచ్చారు, వారికి ఒక థర్డ్ క్లాస్ చదివే అబ్బాయ్ ఉండేవాడు వాడు మొదటి రోజు భయపడుతూ కొత్త స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళ క్లాస్ సార్ ని ,సార్ ఈ ఊరిలో ఎటువంటి వాళ్ళు ఉంటారు అని అడిగాడు . అందుకు ఆయన ఇంతకుముందు నువ్వు వచ్చిన ఊరి లో ఎటువంటి వారు ఉండేవారు? అని అడిగాడు అప్పుడు ఆ బాబు ఆ ఊరిలో అందరూ చెడ్డవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్లు చెడ్డ పనులు చేసేవాళ్లు పక్క వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసే వాళ్ళు ఉండేవాళ్లు అని చెప్పాడు .
అప్పుడు ఆయన అవునా .. అయితే ఈ ఊర్లో కూడా అలాంటి చెడ్డ వాళ్లే ఉన్నారు అని చెప్పారు.

మరుసటి రోజు….

అదే విధంగా ఇంకొక అబ్బాయి వేరే ఊరు నుంచి ఆ స్కూల్ కి కొత్తగా వచ్చాడు ఆయన కూడా సార్ దగ్గరికి వెళ్లి సర్ ఈ ఊరిలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు అని అడిగారు అందుకు ఆయన నీవు ఇంతకుముందు వచ్చిన ఊర్లో ఎటువంటి వాళ్ళు ఉండేవారు అని అడిగాడు అందుకు అబ్బాయి అక్కడ వాళ్ళందరూ చాలా మంచివాళ్లు ఒకరికొకరు సహాయపడుతూ ఉండేవాళ్లు మనకు ఏదన్నా ఆపద వస్తే వాళ్లు సాయం చేసేవాళ్లు అని చెప్పాడు . .
అప్పుడు ఆయన అవునా అయితే ఈ ఊర్లో కూడా అటువంటి మంచి వాళ్లే ఉన్నారు అని ఆ బాబుతో చెప్పారు

“ప్రవర్తన” Small moral story

కథ సారాంశం ఏమిటంటే …

మనము ఎదురు వ్యక్తిని ఏ దృష్టి తో చూస్తామో వారు కూడా మనలను అదే దృష్టి తో చూస్తారు , అంటే మనం ఎదుటివారిలో మంచిని చూసినట్లయితే వారు కూడా మనతో మంచిగా ఉంటారు అలా కాకుండా మనం వారిలో చెడును మాత్రమే గుర్తించి వారితో చెడ్డగా ప్రవర్తిస్తే వారు కూడా మనతో చెడుగానే ప్రవర్తిస్తారు . కాబట్టి ఎదుటివారిని ప్రేమించడం వారితో మంచిగా ప్రవర్తించడం లాంటిది మన వైపు నుంచి మనం చేస్తే వారు కూడా మన తో అంతే ప్రేమగా ఉంటారు.

మనదగ్గర లేనిది మనం పంచలేనిది (అది ప్రేమైనా స్నేహమైనా )ఎదుటివారి నుండి ఆశించడం ఎంతవరకు సబబు . మన ఆనందం కోసం మన ప్రయత్నం కూడా ఉండాలి కదా…

 

For more stories: కథలు తెలుగు లో

For more poems Please visit: Vemana Padyaalu

For more stories please visit: Kathalu in Telugu for kids

Success full people stories: Neeraj Chopra

For more moral stories please visit: Jeevitham

For more Telugu stories please click: Small moral stories for kids in Telugu

For more kids stories please visit: YES and NO Story

 

 

“ప్రవర్తన” Small moral story for Students

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!