Contents
Top 10 Telugu moral stories for kids
we all know moral values are more important for everyone, especially for kids. in this article I am writing the top ten moral stories for kids.
stories say…
- No one spoils the hard-working people.
- Togetherness is great.
- Everybody must know about their strength and weakness.
- There will be a hero in you.
- Based on our Friend’s behavior others will judge us.
- Don’t bother others for our happiness.
- Hard work pays off forever.
- Fight until you win.
- There is no punishment beyond repentance.
- Based on situation we have to behave.
Top 10 Telugu moral stories for kids
1.అలవాటు
ఒక ఊరి లో రాము అనే ఒక అబ్బాయి వుండే వాడు, అతను చదువు లో ఆటలలో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే వాడు, స్కూల్ లో టీచర్స్ అందరు అతనిని బాగా ఇష్టపడేవారు .
రాము వాళ్ళ క్లాస్ లో గోపి అనే ఇంకో అబ్బాయి వుండే వాడు అతని కి రాము ని చూస్తే చాల అసూయ గా వుండేది.రామూ ని ఏదో విధంగా బాధ పెట్టాలి అని గోపి నిర్ణయించు కున్నాడు .ఒక రోజు సాయంత్రం అందరు ఆడుకొనే సమయం లో గోపి రాము స్కూల్ బాగ్ ని ఎవరి కి తెలియ కుండా ఒక చెట్టు మీద దాచాడు.
ఆడుకోవడం అయి పోయాక రాము తన స్కూల్ బాగ్ కోసం చాలా వెతికాడు అయినా బాగ్ కనపడలేదు .చాలా బాధగా ఇంటి కి వెళ్ళాడు ,ఇంకొక రెండు రోజులలో ఎగ్జామ్స్ , బుక్స్ లేకుండా ఎలా చదవాలి అని అనుకున్నాడు. తర్వాత ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యా యి, ఎప్పుడూ లాగా నే మళ్ళీ రాము క్లాస్ ఫస్ట్ వచ్చాడు గోపి కి చాల ఆశ్చర్యం గా అనిపించింది .
రాము దగ్గరకు కు వెళ్లి నీ స్కూల్ బాగ్ పోయింది అన్నావ్ కదా మరి క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చావ్ అన్నాడు ,అందు కు రాము అవును బుక్స్ లేవు కానీ నేను రోజు క్లాస్ లో చెప్పిన పాఠాలు ఏ రోజు వి ఆరోజే చదువు తానూ అందుకు నాకు పాఠాలు అన్ని గుర్తున్నాయి అని చెపుతాడు . ఆ మాట విని గోపి తన ప్రవర్తనకు తానే సిగ్గు పడతాడు. రాము స్కూల్ బాగ్ రాము కి తెచ్చి యిచ్చి రాము కి క్షమాపణ చెపుతాడు. రోజు పాఠాలు సరిగ్గా విని,ఏ రోజు పాఠాలు లు ఆ రోజు చదువు కొనే అలవాటు చేసుకుంటే తాను కూడా క్లాస్ ఫస్ట్ రావచ్చు అని నిర్ణయించుకుంటాడు.
Moral : కష్టపడేవారిని ఎవరు చెడగొట్టలేరు.
2.కోతి బుద్ధి 
ఒక అడవి లో ఒకపెద్ద పండ్ల చెట్టు ఉందేది దాని మీద ఒక పెద్ద కోతి ఉండేది, దాని కి కోపం చాల ఎక్కువ అది ఆ చెట్టు మీదకు ఏ పక్షి ని కానీ జంతువు వుని కానీ రానిచ్చేది కాదు. అది మాత్రమే ఆ చెట్టు పళ్ళు తినేది,మిగిలిన వాటిని ఎవరిని తిననిచ్చేది కాదు.
ఆ కోతి అంటే ఎవరికి నచ్చేది కాదు. ఒక రోజు ఆ అడవి లో పెద్ద గాలిదుమ్ము వర్షం వచ్చింది ఆ వర్షం లో చాలా చెట్లు విరిగి పోయాయి . అలాగే కోతి ఉన్న చెట్టు కూడా విరిగిపోయింది యిప్పుడు కోతి కి ఎటువంటి ఆశ్రయం లేదు ఏ జంతువు కోతి కి సహాయం చేయలేదు ,అప్పుడు కోతి ఇన్నిరోజులు తాను మిగిలిన జంతువులతో ఎంత తప్పుగా ప్రవర్తించిందో తెలుసు కొని వాటిని క్షమాపణ అడిగింది ,వారి సహాయం కోరింది అప్పుడు అన్ని జంతువులు కోతికి సహాయం చేసాయి .
అప్పటి నుండి కోతి అందరి తో స్నేహం గా ఉండేది . అందరితో కలసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసు కుంది
Moral : కలసి ఉంటే కలదు సుఖం
3.తెలివి తక్కువ తనం
ఒక రాబందు ఒక చిన్న మేక పిల్ల ను తన రెండు కాళ్లతో పట్టు కొని ఆకాశం లో కి వెళ్లడం ఒక గ్రద్ద చూసింది . నిజం చెప్పాలి అంటే గ్రద్ద కు రాబందు కు ఉన్నంత బలం ఉందదు .
కానీ గ్రద్ద నేను కూడా రాబందు లాగ నా ఆహారాన్ని నేనే తెచ్చుకుంటాను అనుకుంది,వెంటనే ప్రక్కన ఒక గొర్రెల మంద వుంది దాని లో ఒక గొర్రె మీద వెళ్లి వాలింది ,అంతలో అక్కడి కి గొర్రెల కాపరి వచ్చాడు ,అతనిని చూసి గ్రద్ద ఎగిరిపోవాలి అనుకుంది కానీ అప్పటికే దాని రెండు కాళ్ళు గొర్రె బొచ్చు లో ఇరుక్కు పోయాయి.
అది ఎగర లేక పోయింది, గొర్రెల కాపరి దానిని తీసుకొని తన పిల్లలు ఆడుకోవడాని కి ఇంటికి తీసుకు వెళ్ళాడు .ఆ విధంగా గ్రద్ద తనని తానూ ఎక్కువ అంచనా వేసి ప్రాణం మీదకు తెచ్చుకుంది .
Moral : ఎవరి బలం ఎంతో వారి కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి
4.సూపర్ హీరో
ఒక స్కూల్ లో పిల్లలు అందరు ఆడుకుంటూ వుంటారు ఒకపాప నాకు స్పైడర్ మాన్ అంటే ఇష్టం అంటుంది,ఇంకో పాప నాకు ఐరన్ మాన్ అంటే ఇష్టం అంటుంది అప్పుడు స్వాతి వచ్చి అందరూ సూపర్ హీరోస్ గ్రేట్ వాళ్ళు మనకు ఎప్పుడు హెల్ఫ్ కావాలన్న చేస్తారు అంటుంది ,అప్పుడు అందరు అవును అంటారు .
అప్పుడే స్కూల్ లోకి ఒక కుక్క వస్తుంది అది చాల పెద్దగా భయంకరంగా ఉంటుంది అది ఎవరిని కరుస్తుందో అని అందరు భయపడుతూ వుంటారు, అప్పుడు ఒక పాప స్వాతి నువ్వు ఎవరన్నా సూపర్ హీరో ని పిలవవా అంటుంది ,అప్పుడు స్వాతి ఎవరన్నా సూపర్ హీరో వచ్చి మాకు సహాయం చేస్తి బాగుణ్ణు అనుకుంటుంది కానీ ఎంతసేపటికి ఎవ్వరూ రారు,అప్పుడు స్వాతి కి ఒక ఆలోచన వస్తుంది తన స్నాక్స్ బాక్స్ లో వున్న ఆహారం కుక్క కి వేస్తుంది అప్పుడు కుక్క ఆహారం తింటూవుంటుంది ,అప్పుడు పిల్లలు అందరు క్లాస్ లోకి వెళ్లి వాళ్ల టీచర్ తో కుక్క గురించి చెపుతారు అప్పుడు వాళ్ళ టీచర్ కుక్క ని బయటకు పంపిస్తారు .
అప్పుడు స్వాతి అందరితో సూపర్ హీరోస్ అంటే ఎవరో కాదు వాళ్ళు మనలోని వుంటారు అని అందరితో అంటుంది .అప్పుడు అందరు “స్వాతి ది హీరో “అంటారు .
Moral : నీ లోను ఒక హీరో ఉంటాడు
Top 10 Telugu moral stories for kids
5.సహవాసం
చరణ్ స్కూల్ లో కొత్తగా చేరతాడు ,అతనికి స్కూల్ లో ఎవరు కొత్త స్నేహితులు అవుతారో అని చాల ఉత్సాహంగా ఉంటాడు. అంతలో కొంతమంది పిల్లలు వేరే తరగతి గది లోకి వెళ్లడం గమనిస్తాడు ,వాళ్లు ఆ తరగతి గది లో ఎవరు లేకుండా చూసి అక్కడ వున్న లంచ్ బాక్స్ లు అన్ని తినడం చూస్తాడు ,ఈ విషయం అంతా చరణ్ కి చాల బాగా నచ్చుతుంది .
మరుసటి రోజు వాళ్లతో స్నేహం చేయాలి అని నిర్ణయించుకుంటాడు ,తరువాత రోజు వాళ్ళతో కలసి ఇంకో క్లాస్ కి వెళతాడు లంచ్ బాక్స్ లు తినడానికి ,అంతలో స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి అక్కడ వున్న పిల్లలు అందరికి చేసిన తప్పుకు శిక్ష విధిస్తాడు. చరణ్ నేను ఈ రోజే వచ్చాను అని ఎంత చెప్పిన ఎవరు వినరు ,అందరితో పాటు చరణ్ ని కూడా బాగా తిడతారు .
స్నేహితుల్ని ఎంచుకోవడం లో తానూ ఎంత తప్పు చేసాడో చరణ్ కి అప్పుడు అర్థం అవుతుంది.
Moral : మన స్నేహితుల్ని బట్టే మనలను ఇతరులు అంచనా వేస్తారు
6.అమ్మప్రేమ(Moral Story of Mother Love)
ఒకరోజు జాను అన్న తో కలసి పక్కనే వున్నా పార్క్ కి వెళ్ళింది,కొంచం సేపు ఆడుకొని తర్వాత ఉయ్యాల ఊగడానికి వెళ్ళింది. ఉయ్యాల ఊగుతుంటే తన కాలికి ఏదో మెత్తగా తగిలినట్టు అనిపిస్తే క్రింద కు చూసింది ,ఆశ్చర్యం అక్కడ చిన్న కుక్క పిల్ల కనిపించింది అది చాల అందంగ వుంది.జానుకి చాల సంతోషం గా అనిపించి కుక్క పిల్లను తీసుకొని పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది .
అమ్మా నాకు ఏమి దొరికిందో చూడు అని అమ్మ కి చూపించింది ,అమ్మ ని అడిగి దానికి పాలు తాగించింది .తర్వాత జాను వాళ్ళ అమ్మ ,జాను నీకు నేను కనిపించక పోతే నీకు భయం వేస్తుందా అని అడిగింది అప్పుడు జాను అవును అమ్మ నాకు చాలా భయం,బాధ కూడా వేస్తుంది అన్నాది .అప్పుడు అమ్మ నీకు లాగే ఈ కుక్క పిల్లకు కూడా అమ్మ ఉంటుంది కదా,మరి నువ్వు ఈ కుక్క పిల్లని తీసుకు వచ్చావ్ దీని అమ్మ దీని కోసం బాధ పడుతుంది కదా అంటుంది .
అప్పుడు జాను అవును అమ్మ కానీ నాకు ఈ కుక్క పిల్ల చాల నచ్చింది అని ఏడుస్తూ అంటుంది ,అప్పుడు అమ్మ అలాగ కాదు అమ్మ మనం మళ్ళి పార్క్ కి వెళదాం.. అక్కడ దీని తల్లి ఉంటే దీనిని ఇచ్చేదాం లేక పొతే మళ్ళి తెచ్చుకుందాం అంటుంది అప్పుడు జాను ఒప్పుకుంటుంది . తర్వాత పార్క్ కి జాను,అమ్మ కుక్క పిల్లను తీసుకొని వెళతారు .
అక్కడ ఒక కుక్క ఉంటుంది దానిని చూడంగానే కుక్కపిల్ల జాను చేతిలోనుంచి దిగి పరిగెత్తుకుంటూ ఆ కుక్క దగ్గ రకు వెళుతుంది. కుక్క,కుక్కపిల్ల ఆడుకుంటూ వుంటారు ,అది చూసి జాను కి చాల సంతోషంగా అని పిస్తుంది . అప్పుడు జాను అమ్మని పట్టుకొని thank you అమ్మ నీవల్లే ఈ కుక్క మళ్ళి దాని అమ్మ దగ్గరకు వెళ్ళింది అంటుంది. అమ్మ ,జాను సంతోషం గా ఇంటికి వెళతారు .
Moral : మన సంతోషం కోసం ఎవరిని బాధ పెట్ట కూడదు
7.కష్టం -ఫలితం (Moral Story of Hard Working Formar)
నాగన్న చాలా పేదవాడు అతని కి యిద్దరు చిన్న పిల్లలు ,భార్య వుండేవారు. అతను చాల తక్కువ ఖరీదు కు రావడం తో ఊరి చివర ఒక స్థలాన్ని అప్పుచేసి మరీ కొన్నాడు .
ఆ స్థలం మొత్తం రాళ్లు ,ముళ్ళ పొదలతో నిండి వుంది .ఆ స్థలం చూసి అందరు నాగన్నకు తెలివి లేదు అందు కే ఈ స్థలాన్ని కొన్నాడు అని అవహేళన చేసేవారు ,నాగన్న వారి మాటలు పట్టించు కోకుండా ఆ స్థలాన్ని బాగు చేయడం ప్రారం భించాడు .
కొద్ది రోజులలోనే ఆ స్థలాన్ని రాళ్లు లేకుండా చదును చేసాడు . ఆ నేలలో చిన్న చిన్న పంటలు వేసి పండించేవాడు .ఆ పంట తీసుకొని పట్నం లో అమ్మి వచ్చిన డబ్బుతో మళ్ళీ ఇంకో పంట వేసేవాడు ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత నాగన్న బాగా సంపాదించి ఒక పెద్ద యిల్లు కట్టుకున్నాడు ,కొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఒకప్పుడు అతని ని చూసి నవ్విన వారంతా నాగన్నని మెచ్చు కున్నారు ,కష్టపడితే ఏమన్నా సాదించ వచ్చుఅని తెలుసు కున్నారు
Moral : కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుంది
8.పోరాటం
ఒక యుద్ధ సమయం లో రాజు గారు అలసి పోయి ,గెలుస్తామని ఆశ కోల్పోయి దగ్గర్లో వున్నా ఒక గుహ లో దాక్కున్నాడు.అప్పుడు ఆ గుహ లో తన గూడు నిర్మిచు కుంటున్న ఒక సాలీడు ని చూసాడు ,అది తన గూడు నిర్మిచు కొనే ప్రయత్నం లో ఎన్నో సార్లు క్రింద పడుతుంది మళ్ళి పై కి వెళ్లి మళ్ళి గూడు కడుతుంది .
అదే విధంగా గూడు పూర్తి అయ్యేవరకు నిరంతరం ప్రయత్నం ఆపకుండా పూర్తి చేసింది . ఆ సాలె పురుగు లోని పట్టుదలను,ఏకాగ్రతను చూసి రాజు సిగ్గు పడ్డాడు.
తన ప్రయత్నాన్ని కూడా పట్టుదల తో పూర్తి చేయాలి అనుకున్నాడు, తాను యుద్ధం లో మళ్ళి పాల్గొని విజయం సాధించాడు .
Moral : గెలిచే వరకు పోరాడాలి
9.పశ్చాతాపం
నరేన్ చాలా మంచి అబ్బాయి ,చాలా పద్దతిగా ఉంటాడు.ఒకరోజు నరేన్ కి అనుకోకుండా జ్వరం వచ్చింది ,చాలా నీరసం గా అయిపోయాడు .
నరేన్ తాత గారు నరేన్ ప్రక్కన కూర్చో ని ,ఇలా చెప్పారు నేను చిన్నప్పుడు మా అమ్మకు తెలియ కుండా అద్దం పగల గొట్టాను కానీ అమ్మకి చెప్పలేదు నా మనసులో చాలా అపరాధ భావం ఉందేది అని అన్నాడు అప్పుడు నరేన్ మరి మీరు ఏమి చేశారు అన్నాడు .
అప్పుడు తాత గారు నేను మా అమ్మ తో విషయం అంతా చెప్పి ,క్షమాపణ అడిగాను అప్పుడు నా మనసు తేలిక పడిందిఅన్నారు .
అప్పుడు నరేన్ తాత గారు నేను మీ పెన్ విరుగగొట్టి మీకు తెలియ కుండా దాచాను నన్ను క్షమించండి అని ఏడ్చాడు,అప్పుడు తాత గారు నవ్వి ఇంక ఎప్పుడూ నీ తప్పులు మా దగ్గర దాచవద్దు అన్నారు .
తప్పు దాచితే మనసులో భారం పెరుగుతుంది చెప్పితే ప్రశాంతం గ ఉంటుంది అన్నారు . నిజం గానే యిప్పుడు నా మనసు ప్రశాంతం గా వుంది .జ్వరం కూడా పోయింది…
Moral : పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు
Top 10 Telugu moral stories for kids
10.గాడిద-తోడేలు
ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక గాడిద ఉండేది ,అది చాలా తెలివి తక్కువది ఈ విషయం ఒక తోడేలు గమనించింది .గాడిద దగ్గరకు వెళ్లి దానిని నమ్మించి స్నేహం చేసింది. రోజు రాత్రి తోడేలు, గాడిదతో కలసి ప్రక్కన వున్న పొలాలకు వెళ్ళేది ..
గాడిద బలమైనది కనుక అది పొలాని కి వున్న కంచె విరగగొట్టెది,తోడేలు అక్కడ వున్న కోళ్లను ,బాతులనూ తినేది గాడిద మాత్రం గడ్డి తినేది.ఒకరోజు అదే విధంగా ఒక పొలాని కి వెళ్లారు గాడిద కడుపు నిండుగా గడ్డి తిన్నది ,చల్ల గాలి ,వెన్నెల ఆ వాతావరణం నచ్చి నాకు పాట పాడాలని వుంది అని తోడేలుతో అంది ..
తోడేలు వద్దు అంటున్నా వినకుండా తన గార్ధభ స్వరం తో పాడటం మొదలు పెట్టింది అది విని తోడేలు పారిపోయింది . ఆ స్వరం విని అక్కడకు వచ్చి న రైతులు గాడిదను చితక గొట్టారు .
Moral : సమయాను కూలంగా ప్రవర్తించాలి
Sireesha.Gummadi
♥♥For audio stories please visit: Telugu library official
In this article, we are written Top 10 Telugu moral stories for kids. For more Telugu moral stories Follow our website.
For more Telugu stories, please visit: Telugu Kathalu
కథలు చాలా బాగున్నాయి, చిన్నపిల్లలకు అర్ధమయ్యేలా రాసారు, ఇంకా చదవలేని పిల్లలకు తల్లులు చదివి వారికి కథలోని నీతి చెప్పవచ్చు, నేటి తరం తల్లులకు చక్కగా ఉపయోగపడతాయి, శుభాకాంక్షలు
Thank you..
స్తోరిలు బాగున్నాయి, చదవాదానికి, బాగున్నాయి న,హోమ్, వర్క్,కి, రాసుకున్న మరియు, హాలిడేస్ హోంవర్క్, కి, కథలు రాయమన్నారు మివే రాసేసా, మీరు కథలు పెట్టినందుకు ధన్యవాదాలు
thank you jyoti gaaru
Super stories…
thank you padmaja..
Nice and new stories.
thank you…..
Nice and new stories.
thank you…
[…] For more Moral Stories please visit: Telugu moral Stories […]
[…] For more moral stories please visit: Top ten telugu moral stories for kids […]
Nice Stories
Thank you andi
Top ,.. top top … post! Keep the good work on !
wonderful post, very informative. I wonder why the other specialists of this sector don’t notice this. You must continue your writing. I am sure, you have a great readers’ base already!
Good Moral Stories, This is the site learnt morality. keep sharing
Thank you
I really enjoyed reading these short stories in telugu. i bookmarked this website.
Nice
Thank you andi